భర్తల దినోత్సవాన్ని కృష్ణ ఎలా సెలబ్రేట్ చేయనుంది!
on Sep 23, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-269 లో.. ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారో మురారికి కృష్ణ వివరిస్తుంది. అది విని మురారీకి నీరసం వస్తుంది. మనసు పెట్టి చూస్తే అమ్మాయిల మనసు ఈజీగా అర్థం చేసుకోవచ్చని కృష్ణ అంటుంది. ఇక మధు తన గదిలో రెడీ అవుతుంటాడు. అప్పుడే అలేఖ్య వచ్చి.. ఎక్కడికెళ్తున్నారని అడుగుతుంది. బయటకు ఫ్రెండ్స్ తో గెటూ గెదర్ కి వెళ్తున్నాని మధు అంటాడు. నాకు షాపింగ్ కి డబ్బులు కావాలని అలేఖ్య అంటుంది. డబ్బులు లేకపోతే షాపింగ్ ఎలా చేస్తావని మధు అనగానే.. నా దగ్గర నీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఉన్నాయని అలేఖ్య అంటుంది.
అమ్మ ముకుంద నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రావమ్మా అని ముకుందకి వాళ్ళ నాన్న మెసేజ్ చేస్తాడు. ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మ, అన్ని సార్లు కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అడుగగా.. మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని ముకుంద అంటుంది. నా ప్రేమని బ్రతికించమని ఇంటికొచ్చి బ్రతిమాలాడని ముకుంద అంటుంది. అలా మాట్లాడకమ్మ అని వాళ్ళ నాన్న శ్రీనివాస్ అంటాడు. నటించకని, నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారని ముకుంద అంటుంది. నా కోసం ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొవద్దని ఇది నా చివర కోరిక అని ముకుందతో ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ అంటాడు. దానికి ముకుంద సైలెంట్ గా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునేది దూరంగా చూసిన రేవతి.. ముకుంద స్పీడ్ కి ఎలాగైనా కళ్లెం వేయాలని అనుకుంటుంది. మధు ఫోన్ కి యాభై వేలు డెబిట్ అయ్యాయని మెసేజ్ వస్తుంది. ఇక తొందర తొందరగా అలేఖ్య దగ్గరికి మధు వెళ్తాడు. ఏంటే ఇవన్నీ ఇలా ఖర్చు చేస్తాన్నావని మధు అంటాడు. కృష్ణ మురారీలతో కలిసి రీల్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్నావ్ కదా అందుకే షాపింగ్ చేశానని అలేఖ్య అంటుంది. కాసేపటికి ఇద్దరు గొడవపడతారు.
అందరు డైనింగ్ దగ్గర భోజనానికి కూర్చుంటారు. భర్త పక్కన భార్య కూర్చోవాలని కృష్ణ అంటుంది. అది విని మురారి పక్కన ఉన్న మధుతో.. వెళ్ళి అలేఖ్య పక్కన కూర్చోమని అంటుంది. అతను వినకపోయేసరికి భవాని గట్టిగా చెప్తుంది. ఆ తర్వాత మురారి పక్కన ఖాళీ ఉన్న కుర్చీలో ముకుంద కూర్చుంటుంది. ఇక పక్కనే ఉన్న మురారీకి అప్పడం వేసుకో అని వేస్తుంది ముకుంద. అది తీసుకొని నేనుండగా నువ్వు వడ్డించడం బాగుండదని కృష్ణ తీసుకుంటుంది. అది విని భవాని.. తింగరి పిల్ల ఏంటి నీ ప్రాబ్లమ్ అని భవాని అంటుంది. భాద్యతలు తీసుకున్నప్పుడు అందరికి సమానంగా పంచాలని తెలియదా.. అసలు ఇష్టపడే ఇంటి భాద్యతలు తీసుకున్నావా? దీంట్లో ఇంకెవరి ప్రోద్బలమైనా ఉందా అని ముకుందని భవాని అడుగుతుంది. లేదత్తయ్యా.. మనస్ఫూర్తిగా తీసుకున్నానని అంటుంది. సరే భోజనం చేయమని ముకుందని భవాని అంటుంది. పెద్దత్తయ్య మీకో విషయం చెప్పాలని కృష్ణ అనగా.. ఏంటది అని భవాని అంటుంది. రేపు భర్తల దినోత్సవం కాబట్టి భర్తలకి సన్మానం చేస్తారని, వాళ్ళకిష్టమైన వంటలు చేయాలి, వాళ్ళకి ఒక ప్రామిస్ చేయాలని కృష్ణ అంటుంది. అవునా అందరు ఆశ్చర్యపోతారు. ఆదర్శ్ కి ఇష్టమైన వంటలన్నీ ముకుందతో చేపిస్తా అని కృష్ణ అంటుంది. సరే కృష్ణ అని భర్తల దినోత్సవానికి ఏర్పాట్లు చేయమని భవాని అంటుంది. కృష్ణ ఫోకస్ అంతా నా మీదే పెట్టిందని ముకుంద అనుకుంటుంది. ఇక అప్పుడే అలేఖ్య మాటలు గుర్తుచేసుకొని.. ఇక ఈ ముసుగులో గుద్దులాటలెందుకు డైరెక్ట్ గా తేల్చుకుందామని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
